ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 8:18 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

జూరాలకు నీటి విడుదలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
కర్ణాటక సీఎంతో నీటి సమస్యపై మాట్లాడడానికి మంగళవారం తెలంగాణ నుండి కర్ణాటక బయలుదేరిన మంత్రులు. ఉమ్మడి పాలమూరు జిల్లా రైతుల సాగునీటి అవసరాల దృష్టిలో ఉంచుకొని జూరాల ప్రాజెక్టు నుండి కాలువ ద్వారా పంట పొలాలకు సాగునీరు అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి రాష్ట్ర  మంత్రి పాలమూరు ఉమ్మడి జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు,వాకిటి శ్రీహరి,గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రులు సచివాలయంలో కలిసి నీటి సమస్యను వివరించారు. మంత్రుల,ఎమ్మెల్యేల విజ్ఞప్తి పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. కర్ణాటక సీఎంతో ఫోన్లో సంభాషించి సాగునీటి అవసరాల దృష్ట్యా ఆలమట్టి, నారాయణపూర్ జలాశయాల నుండి నుంచి జూరాలకు నీటిని విడుదల చేయాలని కోరారు.
===================